- Advertisement -
మృత్యువులో కూడా వీడని బంధం
A bond that will not be broken even in death
పాతపట్నం: సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పాతపట్నం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన దంపతులు పెద్దగోపు వరప్రసాద్, వాణి ఘటనా స్థలంలో మృతి చెందారు. కాగా కుమారుడు విహార్ కు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీకాకుళంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి కారులో భార్య, భర్త, కుమారుడు తో పాటు ఇద్దరు బంధువులు తో తిరిగి కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతి వార్త విన్న అచ్యుతాపురం గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు.
- Advertisement -



