మున్నూరుకాపు డైరీ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఆహ్వానం
MP Vaddiraju Ravichandra invited as chief guest for Munnurukapu diary launch
వాయిస్ టుడే:
మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణతో పాటు ఇటీవల గెలిచిన సర్పంచుల సత్కార కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లోని సిక్ విలేజ్ డైమండ్ పాయింట్ సమీపంలో ఉన్న శ్రీరాజరాజేశ్వరి గార్డెన్స్ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు, సంఘం గౌరవాధ్యక్షులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్‌తో పాటు ఇతర ప్రముఖులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావా వసంత పటేల్, డైరీ కమిటీ చైర్మన్, సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళరాపు లక్ష్మణ్ పటేల్, ఉపాధ్యక్షులు పర్వతం సతీష్ కుమార్ పటేల్, వాసాల వెంకటేశ్వర్లు పటేల్, రాష్ట్ర మహిళా నాయకురాలు మంజుల పటేల్, రాష్ట్ర కాపు సంఘం నాయకులు కాసారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.



