చిరంజీవితో కొండా సురేఖ భేటీ

- Advertisement -

చిరంజీవితో కొండా సురేఖ భేటీ

Konda Surekha meets Chiranjeevi

Konda Surekha meets Chiranjeevi
Konda Surekha meets Chiranjeevi

హైదరాబాద్ మార్చి 3
మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కలిశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరు ఇంటికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. తన వెంట తీసుకువచ్చిన ఆంజనేయుడి చిత్ర పటాన్ని ఆయనకు బహూకరించారు. కొండా సురేఖ తన కుమార్తె సుస్మితతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లడం గమనార్హం. అయితే ఆమె ఎందుకు చిరంజీవిని కలిశారు అనేది మాత్రం వెల్లడించలేదు. పైగా ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కొండా సురేఖ.. కేంద్ర మాజీమంత్రి అంటూ మెగాస్టార్ చిరంజీవిని సంబోధించడం గమనార్హం.చిరంజీవిని కలిసిన కొండా సురేఖ .. ఆయనకు ఇష్టమైన ఆంజనేయస్వామి చిత్రపటాన్ని అందించారు. ఆ తర్వాత కొద్దిసేపు చిరంజీవితో భేటీ అయ్యారు. కొండా సురేఖ వెంట ఆమె కూతురు కొండు సుస్మిత కూడా ఉన్నారు. చిరంజీవితో భేటీ అయిన వీడియో, ఫోటోల‌ను మంత్రి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అదే పోస్ట్‌లో చిరంజీవిని ఆమె మాజీ కేంద్రమంత్రి అంటూ పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. తాను ఇక నుంచి రాజ‌కీయాల్లోకి తిరిగి వ‌చ్చే ప్రస‌క్తి లేనేలేద‌ని ఇప్పటికే గతంలో పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండా సురేఖ.. చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి భేటీ కావడం వెనుక ఏదైనా కారణం ఉందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి రారని సంబంధిత వర్గాలు ఇప్పటికే కుండబద్ధలు కొట్టి చెప్పేశాయి.ఇక చిరంజీవిని కొండా సురేఖ కలిసిన ఫోటోలు, నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇటీవలె రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి కొండా సురేఖ శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లార‌ని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు.. చిరంజీవికి కొండా సుస్మిత ఫ్యాన్ అని.. అందుకే ఆయ‌న‌ను క‌లిసేందుకు తన తల్లితో కలిసి వెళ్లార‌ని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular