Saturday, February 21, 2026

తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతులు కోశారు :ఆది శ్రీనివాస్,ప్రభుత్వ విప్

- Advertisement -

తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతులు కోశారు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు
ఆది శ్రీనివాస్,ప్రభుత్వ విప్
హైదరాబాద్

They made the people of Telangana believe and then cut their throats: Aadi Srinivas, government whip
తెలంగాణ ఉద్యమం మాదే. తెలంగాణ మేమే తెచ్చాం. తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ . ఇంత కాలం గులాబీ పార్టీ నాయకులు చెప్పుకొని తిరిగారు. సెంటిమెంటు ను రగిలించి రాజకీయంగా లబ్దిపొందారు. తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతులు కోశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు. మీ బండరాన్ని మా ముఖ్యమంత్రి ఒక్కొక్కటి బయట పెడతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
మీ అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నారు. మీ జాతిపిత డ్రామాలను ఒక్క దెబ్బతో మా ముఖ్యమంత్రి పటాపంచలు చేశారు. మా సీఎం దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయన్న భయంతో కేటీఆర్, హరీష్ రావు తెగ చించుకుంటున్నారు. మామ మెప్పు కోసం హరీష్ రావు మా ముఖ్యమంత్రి పైన నోరు పారేసుకుంటున్నాడు. హరీష్ రావు.. బూతుపిత ఎవరో.. జాతిపిత ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని , ఆ తర్వాత అధికార అహంకారంతో కేసీఆర్ మాట్లాడిన భాష బయటకు తీయమంటావా..?  నీ మామకు జాతిపిత అని మీకు మీరు బిరుదు ప్రధానం చేస్తే తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలాఅని ప్రశ్నించారు.
అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మనందం  భాస్కరా అవార్డు ఇచ్చుకున్నట్లే ఉంది మీ వ్యవహారం. హరీష్ రావు.. ఎక్కువ నోరు పారేసుకోకు. కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తు ఉర్కుంటారని నువ్వు భావిస్తే అది నీ అజ్ఝానం అవుతుందని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్