తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా గెలుస్తాం

- Advertisement -

తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా గెలుస్తాం
షాద్ నగర్

We will win over 75% of the municipal elections in Telangana.
తెలంగాణలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో 75 శాతం పైగా గెలుస్తామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. షాద్ నగర్ లో అయన ఎన్నికల ప్రచారం లో పాల్గోన్నారు.
సంక్షేమ మే మా అభ్యర్థులను గెలిపిస్తుందని అన్నారు. అమ్మా.. బాగున్నారా.. మా పాలన ఎలా ఉంది.. పథకాలు అందుతున్నాయా.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అంటూ మంత్రి ఓటర్లను పలకరించారు. 14వ వార్డు అభ్యర్థి అందెమోహన్ తరపున ఇంటింటి ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక భవాని మాత ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలువీధుల్లో తిరిగి కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 75% పైగా గెలుస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. సీఎం పని తీరుతో ప్రజలు సంతృప్తి గా ఉన్నారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular