Friday, March 13, 2026

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లాకు, జోగులాంబ జోన్కు మంచి పేరు తీసుకురావాలి  – జిల్లా ఎస్పీ  డి.జానకి

- Advertisement -

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లాకు, జోగులాంబ జోన్కు మంచి పేరు తీసుకురావాలి
 – జిల్లా ఎస్పీ  డి.జానకి
మహబూబ్ నగర్

The district and Jogulamba zone should be given a good name in state-level police sports
– District SP D. Janaki
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్నగర్ జిల్లాకు మరియు జోగులాంబ జోన్కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆకాంక్షించారు.
ఫిబ్రవరి 17 నుండి హైదరాబాద్లో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్కు ఎంపికైన క్రీడాకారులను ఉద్దేశించి ఎస్పీ  మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా పోలీస్ శాఖలోని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనశక్తి మరియు నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించే వేదిక అని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ  స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు,  స్పోర్ట్స్ షూస్ అందజేశారు. క్రీడాకారులు సరైన సాధనతో, పూర్తి నిబద్ధతతో పోటీల్లో పాల్గొని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి వేదికపై పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తన వ్యక్తిగత ప్రతిభతో పాటు జిల్లా మరియు జోన్ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తాడని స్పష్టం చేశారు. గెలుపు లక్ష్యంగా కఠిన సాధన చేయాలని, నిరంతర శిక్షణ, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం విజయానికి మూలాధారాలని పేర్కొన్నారు. మైదానంలో చూపే ప్రతీ ప్రదర్శన పోలీస్ శాఖ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంటూ, క్రీడాస్ఫూర్తితో, సంపూర్ణ నిబద్ధతతో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాకు మరియు జోన్కు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ  పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్  అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ఐలు అడ్మిన్ కృష్ణయ్య,  నగేశ్, సత్యం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్