Wednesday, February 18, 2026

కేటీఆర్ చెప్పిన జోగు రామన్న వినలేదు ఎమ్మెల్యే పాయల్  శంకర్

- Advertisement -

కేటీఆర్ చెప్పిన జోగు రామన్న వినలేదు
ఎమ్మెల్యే పాయల్  శంకర్
అదిలాబాద్

Ramanna did not listen to Jogu’s words spoken by KTR
MLA Payal Shankar
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 21 స్థానాలు గెలుచుకున్న బీజేపీ కి మద్దతు ఇవ్వాలని  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తాను స్వయంగా ఫోన్ చేసి కోరానని, వెంటనే తప్పకుండా మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్పినప్పటికీ, జోగు రామన్న కేటీఆర్ మాట వినకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వం మని కేటీఆర్ చెప్పారని, కానీ స్థానికంగా జోగు రామన్న కాంగ్రెస్ లో చేరేది ఉంది కాబట్టే కేటీఆర్ మాట వినకుండా  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడుతూ… గత మున్సిపల్ పాలకవర్గంలో తన కొడుకు చేసిన అవినీతిని బీజేపీ ఎక్కడ బయట పెడుతుందోననే భయంతో జోగు రామన్న బిజెపి కి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయాడని ఆరోపణలు చేస్తున్న జోగు రామన్న మాదిరిగా తాను ఎవరికి అమ్ముడుపోయే పరిస్థితిలో లేనన్నారు. జోగు రామన్న మాదిరిగా లుచ్చ రాజకీయాలు చేయాల్సిన పని తనకు లేదన్నారు. రామన్న కు ఉన్న రాసలీలల సీడీ లు తనకు లేవన్నారు. నీతి తప్పి రాజకీయాలు చేసిన జోగు రామన్నకు త్వరలో హిందువులు, ఆదిలాబాద్ ప్రజలు త్వరలో చీపుర్లతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో లాలా మున్నా. జోగు రవి. ధోని జ్యోతి హనుమన్లు . దినేష్ మోటోలియా. శ్రీకాంత్. గంటా జీవన్ . రాకేష్. సాయి. గోరక్. శివ బండారి సంతోష్. పద్మ. భీమ్సేన్  రెడ్డి .సతీష్.. సూర్య. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్