ఇండో అమెరికన్ చిత్రంలో ప్రియమణి
Priyamani in Indo-American film
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ప్రియమణి… పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇండో-అమెరికన్ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయింది. బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ఇంటర్నేషనల్ మూవీలో నటించబోతోంది. హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారతీయ, అమెరికా సంస్కృతుల కలయికతో, ఒక వలస కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగపూరిత ప్రయాణమే ఈ సినిమా కథాంశం. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన టాప్ టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది.



