మాజీ ఎమ్మెల్యే ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి మంత్రి సీతక్క  

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి
మంత్రి సీతక్క  
హైదరాబాద్

Former MLA Omkar is a man of high values.
— Minister Seethakka
మాజీ ఎమ్మెల్యే  మద్దికాయల ఓంకార్  శత జయంతి వార్షికోత్సవం కార్యక్రమలో  ముఖ్య అతిథిగా  మంత్రి సీతక్క పాల్గోన్నారు.  ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఉద్యమాల్లో, ఎమ్మెల్యేగా ఓంకార్  చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మంత్రి మాట్లాడుతూ  ఓంకార్  ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి.  ప్రజా ఉద్యమాల్లో ఆరితేరిన వ్యక్తి.  అండర్ గ్రౌండ్ లో, ఓవర్ గ్రౌండ్లో పనిచేసిన ఆయన అనుభవాలు అపారం.   ఓంకార్ లాగే నేను తుపాకీ పట్టాను ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాను. ఉద్యమాలు, క్రమశిక్షణ విలువలు ఆయన నుంచి నేర్చుకున్నాను. నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేని లోటు నర్సంపేటకే కాదు యావత్ తెలంగాణకు తీరని లోటని అన్నారు.
ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఏ శక్తులకు లొంగకుండా రాజకీయాలకు విలువలు అద్దిన రాజకీయ దురంధరుడు.  నిత్యం ప్రజల కోసం జీవించిన ఆదర్శప్రాయుడు. ప్రజా సమస్యలపై చట్టసభలలో ప్రజా గల వినిపించిన నిస్వార్ధ ప్రజా సేవకుడు.  అలాంటి ప్రజా నాయకుడి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది.  సురవరం ప్రతాపరెడ్డి, గద్దర్, అందెశ్రీ వంటి వారి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియచెప్పుతున్నాం.  అదే రీతిలో ఓంకారం రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది .  ట్యాంకుబండు మీద ఓంకార్ విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆయన అభిమానుల ఆకాంక్షను ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్తాను ట్యాంక్ బండ్ మీద ఓంకార్  విగ్రహం ఉండేలా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తాను.
అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి.  ఇరాన్ మీద దాడిని కూడా ఖండించలేని పరిస్థితుల్లో మన దేశ ప్రభుత్వం ఉంది.  ఒక దేశ అధినేతను చంపే హక్కు అమెరికాకి ఎవరు ఇచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడకపోతే మన కోసం ఎవరూ మాట్లాడరు.  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమెరికా యుధోన్మాదాన్ని ఖండించాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular