Tuesday, March 24, 2026

 కొండెక్కిన కోడి

- Advertisement -

 కొండెక్కిన కోడి
నెల్లూరు, మార్చి 24 (వాయిస్ టుడే )

The Hen That Climbed the Hill
మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తు్న్న చికెన్‌ ధరలు.. తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతోంది. ధరలు కొండెక్కుతున్నాయి. ఆదివారం బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.340 వరకు ఉండగా, అదే వారం రోజుల కిందట కిలో చికెన్ ధర రూ.260 వరకు ఉంది. చికెన్‌ ధరలు ఒక్కసారి పెరగడంతో సామాన్యులు కష్టంగా మారిపోయింది. ముందే యుద్దం కారణంగా ఒక్కొక్కటిగా ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చికెన్‌ ధరలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే మరోవైపు కోడి గుడ్డు ధర మాత్రం పడిపోతున్నాయి. గతంలో ఒక గుడ్డు ధర రూ.8 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.4..20 పైసల వద్ద కొనసగుతోంది. కోడిగుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో ధరలు పడిపోయాయని పౌల్ర్టీ యజమానులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లు తమిళనాడుకు తీసుకెళ్లి అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గుడ్డు ధర ఆమాంతంగా పడిపోయింది.చికెన్‌ ధర పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్‌, ఇతర ఫంక్షన్ల కారణంగా చికెన్‌ ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు చికెన్‌ దుకాణ వ్యాపారులు. డిమాండ్‌కు సరిపడా చిన్న బ్రాయిలర్‌ కోళ్లు కూడా దొరకడం లేదట. అలాగే పౌల్ట్రీ నిర్వాహకులు పిల్లల పెంపకం ఆపేడయం కూడా మరో కారణం అంటున్నారు. కోళ్లు డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేని కారణంగా చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్