రామనవమి శోభా యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
హైదరాబాద్
CP Inspects Arrangements for Ram Navami Procession
శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, శుక్రవారం సీతారాం బాగ్ పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ యాత్ర ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై, రాత్రి 10 గంటల కల్లా ముగిసేలా పక్కా రూట్ మ్యాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో కలిసి యాత్ర సాగే మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు 3 వేల మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతకుముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలిసి ఆయన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



