జక్కన్న .. ‘వారణాసి’ లెక్క వేరు
Jakkanna… Varanasi is a different league altogether.
రాజమౌళి వారణాసి గ్లింప్స్ని ఎంత పెద్ద స్థాయిలో విడుదల చేశారో గుర్తుండే ఉంటుంది. దేశం మొత్తమ్మీదే అలాంటి ఈవెంట్ జరగలేదు. ఈ ఒక్క ఈవెంట్… ఈ సినిమాకి గ్లోబల్ స్థాయిలో ప్రచారాన్ని తీసుకొచ్చింది.సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా గురించి గానీ, కథ గురించి కానీ, పాత్రల గురించి కానీ మాట్లాడడు రాజమౌళి. అసలు అంత స్పేస్, టైమ్ ఉండదు. కానీ.. ‘వారణాసి’ లెక్క వేరు. ఇంటర్నేషనల్ మీడియాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చాడు జక్కన్న. మహేష్, ఫృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా కూడా ఈ సెషన్స్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించి, కథా నేపథ్యం గురించిన లీకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సెట్స్ ఎలా ఉంటాయో మీడియాకు ముందే లీక్ చేశాడు జక్కన్న.వారణాసి’ ని రాజమౌళి తెలుగు సినిమాలానో, భారతీయ సినిమాలానో చూడడం లేదు. దీన్ని ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా చూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా పేరు వినిపించాలంటే ముందు నుంచీ ప్రమోషన్లు చేసుకొంటూ రావాలి. ఇప్పుడు జక్కన్న చేస్తోంది అదే.



