Thursday, April 23, 2026

పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్

- Advertisement -

పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్

క్రీడామైదానంలో అక్రమ కట్టడాల తొలగింపు

5 నిర్మాణదశలో ఉన్న భవనాల కూల్చివేత

రూ. 100 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
Massive Hydra Operation in the Old City

హైదరాబాద్, ఏప్రిల్ 01:

పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. Hmda అనుమతి పొందిన లేఔట్లో స్పష్టంగా

క్రీడామైదానం అని పేర్కొన్నా ఆక్రమణలకు తెగబడిన వారికి కూల్చివేతలతో బుద్ధి చెప్పింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో హైడ్రా బుధవారం భారీ ఆపరేషన్

నిర్వహించింది. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఔట్లో క్రీడాస్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు ఐదింటిని హైడ్రా

తొలగించింది. మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది. 1800 ల ప్లాట్లకు పైగా ఉన్న ఈ లేఔట్ ప్రకారం 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. క్రీడస్థలానికి కేటాయించిన స్థలం అని తెలిసి

కూడా గత 3 సంవత్సరాలుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. GHMC గతంలో నోటీసులు కూడా ఇచ్చింది.

2024లో demolition చేస్తామని speaking ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. యిదే విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

హైడ్రా అధికారులు GHMC, రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లేఔట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకుంది. నిర్మాణాలు చేపట్టవద్దని వెంటనే హైడ్రా హెచ్చరించింది.

బుధవారం ఉదయం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 నిర్మాణంలో ఉన్న భావనలతో పాటు రెండు చిన్న గదులతో నిర్మించిన వాటిని తొలగించింది. ఇంకో రెండు భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండడంతో వాటిని

మినహాయించింది. క్రీడామైదానం అందుబాటులోకి రావడంతో శాస్త్రిపురం కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమణలు అడ్డుకుంటే

భయపెట్టారని.. హైడ్రా రావడంతో క్రీడాస్థలం కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ కబ్జా చేసిన వాళ్లు సామాన్యులు కాదని.. అడ్డుకున్నవాళ్లను బెదిరించారని

తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్