మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ

- Advertisement -

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ

తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై కీలక చర్చలు

Pawan Kalyan meets Maharashtra CM Devendra Fadnavis.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ముంబైలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ప్రధానంగా తూర్పు కనుమల ప్రాంతంలో పులుల సంరక్షణ, జన్యు వైవిధ్య పరిరక్షణ, అలాగే మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను తరలించే అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండు ఆడ పులులను తీసుకురావాలని నిర్ణయించామని వెల్లడించారు.

ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (ఇన్‌బ్రీడింగ్) సమస్యలు తగ్గి, జన్యు వైవిధ్యం పెరుగుతుందని, తద్వారా పులుల సంఖ్య దీర్ఘకాలికంగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు.

ఈ సంయుక్త చర్య శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ పట్ల ఇరు రాష్ట్రాల నిబద్ధతకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ఈ కార్యక్రమానికి నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయంగా ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular