తెలంగాణ భవన్‌కు రమ్మని చెప్పి, గన్‌పార్క్‌కు మారింది ఎవరు? – కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
‘Who struck poses… who changed the location?’ – KTR lashes out at Congress.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌కు చర్చ కోసం రావాలని చెప్పి, అనంతరం గన్‌పార్క్‌కు వేదిక మార్చిందెవరో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి చివరికి వెనక్కి తగ్గుతోందని ఆరోపించారు. తమ కంటే కాంగ్రెస్ నాయకులకు ఎక్కువ పోలీసు భద్రత ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ నేతలు బయటకు వస్తే మాత్రం పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.
పోలీసులను ఎవరు పంపిస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్, ముఖ్యమంత్రా లేక మంత్రులా దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చర్చకు పిలిచేది కాంగ్రెస్ నాయకులేనని, చివరికి చర్చ నుంచి తప్పుకుంటున్నది కూడా వారేనని అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసి, శాలువాతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఎదురుచూశామని, అయినప్పటికీ ఆయన రాలేదని కేటీఆర్ తెలిపారు.
గన్‌పార్క్ వద్ద చర్చకు రావడానికి కూడా తాము సిద్ధమేనని, అయితే అక్కడికి బయల్దేరగానే పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో వేచి ఉంటే కాంగ్రెస్ నాయకులే వెనక్కి తగ్గారని అన్నారు.
గన్‌పార్క్ వద్ద కూర్చొని కాంగ్రెస్ మంత్రులు తొడలు కొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించిన కేటీఆర్, ప్రజల సమస్యలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
చివరగా, “నిద్రపోయే వాడిని లేపొచ్చు.. కానీ నిద్రపోతున్నట్లు నటించే వాడిని లేపలేం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.




