రాముని సన్నిధిలో హనుమంతుని మౌన దీక్ష !

- Advertisement -

రాముని సన్నిధిలో హనుమంతుని మౌన దీక్ష !

అయోధ్య శ్రీరామ మందిరంలో అవినీతి పై సీబీఐ తో విచారణ చేపట్టాలి : కాంగ్రెస్ నేత వి హెచ్.

Hanuman’s vow of silence in the presence of Rama!

Hanuman's vow of silence in the presence of Rama!
Hanuman’s vow of silence in the presence of Rama!

(భద్రాచలం, జూలై 13 ) అయోధ్య రామాలయం లో జరిగిన అవినీతి పై సీబీఐ తో విచారణ చేపట్టాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు డిమాండ్ చేసారు . ఈ విషయమై ఆయన సోమవారం భద్రాద్రి రాముని సన్నిధి లో మౌన దీక్ష చేపట్టారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం సమీపంలో కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన అయోధ్య శ్రీరామ మందిరంలో అవినీతి అంశంపై ఆయన నిరశన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అవినీతి పై సీబీఐ తో విచారణ చేపట్టి దోషులను కఠనం గా శిక్షించాలని డిమాండ్ చేసారు.
శ్రీరామ మందిర నిర్మాణం వంటి పవిత్ర కార్యక్రమంలో “అయోధ్య శ్రీరామ మందిరంలో జరుగుతున్న అవకతవకలు – ఆరోపణలు పై ఆయన విచారం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ అవకతవకలైనా వెలుగులోకి తీసుకువచ్చే లా సీబీఐ తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ మౌనదీక్షకు సంఘీభావం తెలుపుతూ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,
సర్పంచ్ పూనెం కృష్ణ, ఉపసర్పంచ్ రత్నం కవిత, పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular