- Advertisement -
తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
Garuda Panchami celebrated in Tirumala
గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. శ్రీవారి వాహనాల్లో గరుడుడు అగ్రగణ్యుడు. ప్రతి ఏటా శుక్ల పక్షం ఐదో రోజున గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నూతన దంపతులు వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని, మహిళలు తమ సంతానం గరుడునిలా బలశాలిగా ఉండాలని పూజలు చేస్తారు.
- Advertisement -




