ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్
బీహార్ అసెంబ్లీలో బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణం
Prashant Kishor sworn in as MLA.
పాట్నా, ఆగస్టు 18 (వాయిస్ టుడే): జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్‌కుమార్ సమక్షంలో బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
ఆగస్టు 3న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో విజయం సాధించడం ద్వారా పీకే రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు.
ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్‌పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పీకే.. బీహార్ రాజకీయాల్లో తన పార్టీకి ప్రాతినిధ్యం కల్పించారు.




