‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’  చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’  పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

- Advertisement -

 ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’  చిత్రం నుంచి ‘ఏదో బాగుందే..’  పాటను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

Hero Sree Vishnu has released the song ‘Edo Bagunde…’ from the movie ‘Ee Nimishaniki Emi Jaruguno’.
రాజు వెడ్స్‌ రాంబాయ్‌ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్‌ రాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’. ఒక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రతిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయితేజ దర్శకుడు. లక్కీ మీడియా, కేడీ అండ్‌ కో బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్‌, దీవెల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణనంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.  కాగా ఈ చిత్రం నుంచి కృష్ణకాంత్‌ రచించిన  ఏదో బాగుందే అనే లిరికల్‌ వీడియోను ప్రముఖ యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ” సాంగ్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది.. విజువల్స్‌ బాగున్నాయి. సాంగ్‌ అందరికి నచ్చుతుంది. సంగీత దర్శకుడు శశాంక్‌ మంచి ట్యూన్‌ అందించాడు. ఈ సినిమా టైటిల్‌తో సహా అన్ని ఫ్రెష్‌గా ఉన్నాయి. టైమ్‌ లూప్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారని తెలిసింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి ఈ సినిమాకు పనిచేసిన అందరికి మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
అఖిల్‌ రాజ్‌, రతిక, షైనింగ్‌ ఫణి, రాజేష్‌ ఉల్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: శశాంక్‌ తిరుపతి, కో ప్రొడ్యూసర్‌: ఠాగూర్‌, నితీష్‌, నిఖిల్‌, డీవోపీ: రవికిరణ్‌ బోయడపు, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్‌, దీవెల శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం: సాయితేజ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular