కోకాపేట మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులపై సమీక్ష
ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి గంగుల, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరుల పర్యవేక్షణ
Review of the construction work on the Munnuru Kapu self-respect building in Kokapet.


భవనాన్ని నిలబెట్టుకుందాం.. మున్నూరు కాపుల ఆత్మగౌరవాన్ని చాటుకుందాం
ఆత్మగౌరవ భవన నిర్మాణంలో ప్రతి మున్నూరు కాపు బిడ్డ భాగస్వామి కావాలి
ఎం.కే. ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పటేల్ పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (వాయిస్ టుడే): మున్నూరు కాపుల ఆత్మగౌరవానికి ప్రతీకగా కోకాపేటలో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాన్ని సమున్నతంగా నిర్మించుకుని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని ఎం.కే. ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పటేల్ పిలుపునిచ్చారు. భవన నిర్మాణంలో ప్రతి మున్నూరు కాపు బిడ్డ భాగస్వామి కావాలని ఆయన కోరారు.
మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోకాపేటలోని 5 ఎకరాల స్థలంలో కొనసాగుతున్న ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను ఆదివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పటేల్ పర్యవేక్షించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పటేల్, ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పటేల్, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ పటేల్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్, ట్రస్ట్ బోర్డు సభ్యులు రౌతు కనకయ్య పటేల్, సి. విఠల్ పటేల్, గాలి అనిల్ కుమార్ పటేల్, పన్నాల విష్ణువర్ధన్ పటేల్, రమేష్ హజారీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులపై సమీక్ష
కోకాపేటలో ఎం.కే. టవర్స్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఫౌండేషన్ చైర్మన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పటేల్ అధ్యక్షతన ట్రస్ట్ బోర్డు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్తు నిర్మాణ కార్యాచరణపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగేందుకు పలువురు సభ్యులు తమ సూచనలు, సలహాలను అందించారు.
భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ, ట్రస్ట్ బోర్డులోకి సభ్యుల చేరిక, నిర్మాణానికి సంబంధించిన విధివిధానాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
నిధుల సమీకరణకు సమన్వయ కమిటీ
భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా ఎం.కే. టవర్స్ నిర్మాణం జరగాలని సమావేశంలో నిర్ణయించారు. ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని ప్రతి నెల రెండో శనివారం నిర్వహించాలని నిర్ణయించారు.
భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు.
పలువురు మున్నూరు కాపు ప్రముఖుల హాజరు
సమావేశంలో మున్నూరు కాపు సంఘం ప్రముఖులు సుంకర బాలకిషన్ పటేల్, మీసాల చంద్రయ్య పటేల్, ఏనుగుల రాజేందర్ పటేల్, గోపాల గణేష్ పటేల్, దేపాల గంగాధర్ పటేల్, మరికల్ పోత సుధీర్ కుమార్ పటేల్, ఆకుల రజిత్ కుమార్ పటేల్, కల్లూరి హనుమంతరావు పటేల్, ఆవుల రామారావు పటేల్, లవంగాల అనిల్ పటేల్, కాశెట్టి కుమార్ పటేల్, ఆకుల స్వామి వివేక్ పటేల్, తోట శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.




