‘భోగి’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం ‘ఏగిలివారంగ’ సాంగ్ రిలీజ్

- Advertisement -

‘భోగి’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం ‘ఏగిలివారంగ’ సాంగ్ రిలీజ్

‘Bhogi’ musical journey begins; ‘Egilivaranga’ song released.
చార్మింగ్ స్టార్ శర్వా ‘భోగి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవల విడుదలైన టీజర్‌తో ప్రారంభమయ్యాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
‘భోగి’ మ్యూజికల్ ప్రమోషన్స్ తాజాగా ‘ఏగిలివారంగ’ పాట విడుదలతో ప్రారంభమయ్యాయి. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ జానపద గీతం సినిమా నేపథ్యాన్ని అద్భుతంగా పరిచయం చేస్తోంది. మట్టి వాసనతో కూడిన జానపద పాటలను రూపొందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు అందమైన బాణీని అందించారు. విభిన్నమైన సంగీత ప్రయోగాలతో సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.
1960ల కాలంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దులోని బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. అప్పటి పల్లె జీవనాన్ని సహజంగా ఆవిష్కరిస్తూ, ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, కులవృత్తులు, గ్రామస్థుల జీవితాలపై పెత్తనం చెలాయించిన స్థానిక భూస్వాముల ప్రభావాన్ని ఈ పాటలో చూపించారు. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ తెలంగాణ సహజమైన మాండలికంలో రాసిన సాహిత్యం ఈ వాస్తవాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. గ్రామంలోని సామాజిక వ్యవస్థ, ప్రజల నిత్యజీవిత అనుభవాలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సహజంగా, వాస్తవికంగా తన సాహిత్యంలో ప్రతిబింబించారు.
నల్గొండ గద్దర్ నర్సన్న  తన వాయిస్ తో పాటకు ప్రాణం పోశారు. తన ప్రత్యేకమైన పల్లె గొంతుతో పాటకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు నర్సిరెడ్డి, కందుకూరి శంకర్ బాబు, రిలారే గోపాల్ పాటకు మరింత పల్లె పరిమళాన్ని అద్దారు.
పాటలోని సంగీతం, సాహిత్యంలోని గొప్పదనానికి విజువల్స్ కూడా చక్కగా తోడయ్యాయి. అప్పటి గ్రామీణ వాతావరణాన్ని, పల్లె జీవనశైలిని సహజంగా రీ క్రియేట్ చేశారు.
శర్వా, అనుపమ పరమేశ్వరన్ తమ పల్లెటూరి పాత్రల్లో ఎంతో సహజంగా కనిపిస్తూ, సినిమా నేపథ్యానికి చక్కగా సరిపోయారు. గ్రామాన్ని, అక్కడి ప్రజల జీవన విధానాన్ని చూపించడంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ పాటకు మరింత లోతును తీసుకొచ్చింది.
దర్శకుడు సంపత్ నంది తన స్టోరీ టెల్లింగ్ తో అద్భుతంగాఆకట్టుకున్నారు. ఆ ప్రాంత సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలు, ప్రత్యేకమైన జీవనశైలిని ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు. ఉత్సాహభరితమైన జానపద సంగీతం, మనసుకు హత్తుకునే సాహిత్యం, కళ్లు కట్టే విజువల్స్‌తో ‘భోగి’ మ్యూజికల్ జర్నీకి ఈ పాట మంచి ఆరంభాన్ని ఇచ్చింది.
ఈ సినిమాలో మరో కథానాయికగా డింపుల్ హయతి నటిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా నిర్మాణానికి సంబంధించిన మిగిలిన పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular