ఎల్నినో ఏర్పడడానికి కారణం
మనం కాదా—మంజుల పత్తిపాటి.
————————————–
Are we not the reason for the formation of El Niño? — Manjula Pattipati.
కరువుకు కారణం ఎవరు..?
చుట్టూ పచ్చదనాన్ని చిదిమేసి…
కొండలను కనుమరుగు చేసి…
ప్రకృతి ఒడిని బీడుగా మార్చి…
చెట్లను నరికి అడవులను మాయం చేసిన వారిది కాదా..?
కరువుకు కారణం ఎవరు..?
చెరువు కుంటలను మాయం చేసి కాంక్రీటు బిల్డింగ్స్ నిర్మాణం చేసిన వారిది కాదా..?
రేపటి మీద నమ్మకంతో బతికే మమ్మల్ని
ఎల్ నినో అనే పేరు పెట్టి
నడి వీధిలో నిలబెట్టింది ఎవరు..?
అరచేతిలో వైకుంఠం చూపించి,
రసాయన ఎరువులు అరువు ఇచ్చి…
అందలమెక్కిస్తామని మాయమాటలు చెప్పి…
రైతన్నలను అగాధంలోకి నెట్టింది ఎవరు..?
ఒక్కసారి ఆలోచించండి …
కేవలం వాతావరణ మార్పు కాదు ఇది..!
మన అత్యాశకు ప్రకృతి ఇచ్చే హెచ్చరిక ఇది..!
బావి తరాలకు దాహం తీర్చే నీటి చుక్క కావాలి..!
ఊపిరి పోసే పచ్చని చెట్టు కావాలి..!
ఇకనైనా మేలుకొందాం ఒక్క మొక్క నాటుదాం..!
ఒక్క బొట్టు నీటిని ఒడిసి పడదాం..!
ప్రకృతితో స్నేహం చేద్దాం..!
అదే మనం ఎల్నినో ప్రశ్నకు మనమిచ్చే గొప్ప సమాధానం..!
దసరా పండుగ శుభాకాంక్షలతో మీ మంజుల పత్తిపాటి.
రచన: మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా




