బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం
Kasireddy Sindhu Reddy appointed as a member of the BJYM national executive committee
శేరిలింగంపల్లి: చందానగర్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేవైఎం తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు కసిరెడ్డి సింధూరెడ్డి బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ హెమాంగ్ జోషీ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సింధూరెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి పూర్తి సమయం కేటాయించి, యువమోర్చా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేవైఎం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.




