- Advertisement -
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
Mega Blood Donation Camp on the occasion of Police Commemoration Day
సైబరాబాద్, అక్టోబర్ 21 (వాయిస్ టుడే): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ శిబిరంలో రెడ్‌క్రాస్ సంస్థకు 44 యూనిట్లు, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 33 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేసి మానవత్వం, సేవాభావాన్ని చాటుకున్నారు.
- Advertisement -




