INTUC భవన నిర్మాణ కార్మిక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోలి శ్రీనివాసరావు నాయుడు
కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తా: శ్రీనివాస నాయుడు
I will work continuously for the rights of workers: Srinivasa Naidu
హైదరాబాద్ (వాయిస్ టుడే): INTUC భవన నిర్మాణ కార్మిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోలి శ్రీనివాసరావు నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు భవన నిర్మాణ కార్మిక శాఖ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి. కుంతియా చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కొలుకూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షుడు ఆర్.సి. కుంతియా నాయకత్వంలో పనిచేస్తూ కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని శ్రీనివాస నాయుడు తెలిపారు. కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మెరుగు రవి గౌడ్, తాండ్ర వెంకటేష్ గౌడ్, కొడాలి శ్రీధర్, సురభి రవీందర్ రావు తదితరులు పాల్గొని శ్రీనివాస నాయుడుకు అభినందనలు తెలిపారు.





