రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సక్సెస్
“Ramabhadrudu” movie auditions in Hyderabad a success
“యంగ్ అండ్ డైనమిక్”, “మా రాముడు అందరివాడు” వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “రామభద్రుడు”. శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ 14వ
సినిమా నుంచి ప్రతిభ గల కొత్త నటీనటులకు ఆహ్వానం పలుకుతూ కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. ఈ ఆడిషన్స్ కు భారీ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక నటీనటులు దాదాపు
500 మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారు. వీరిలో సెలెక్ట్ అయిన వారితో దర్శక నిర్మాతలు అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు. ఇక నెల్లూరులో ఈ సినిమా ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 28, 29
తేదీల్లో అభిరామ్ హోటల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు హీరో శ్రీరామ్ తెలిపారు. ఆసక్తి గల నటీనటులు మీ పోర్ట్ ఫోలియా, వీడియోస్ ను
9347209006, 9849680717 నెంబర్స్ కు వాట్సాప్ చేయవచ్చు లేదా sriramulup1991@gmail.com మెయిల్ చేయవచ్చు. లోకల్ టాలెంట్ కు తమ సినిమాలో మంచి
అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ పేర్కొన్నారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నెల్లూరులో చేయబోతున్నారు. “రామభద్రుడు” చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా
వరప్రసాద్ నిర్మిస్తుండగా సుందర్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు – తనికెళ్ల భరణి, నాగ మహేష్, సమ్మెట గాంధీ, చిత్రం శీను, చిట్టిబాబు, సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, క్రాంతి, తదితరులు



