- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మం 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే పథకంపై కరపత్రాలు పంపిణీ చేశారు. అర్హులు డిసెంబర్ 4 నుంచి 10 వరకు భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద రేషన్, ఆధార్ కార్డులతో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మాచర్ల తిరుమలరావు, ఎస్.కె. హుస్సేన, మహిళా, యువజన నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -




