కటింగ్ పేరుతో క్వింటాల్కు 7 కిలో దోపిడి చేస్తున్న కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం పార్టీ

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల బస్తా కి అదనంగా మూడు కిలోలు 43 కిలోల చొప్పున తూకం వేస్తూ ఒక క్వింటాలకి 7 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారని ఈ దోపిడి వెంటనే నివారించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామ వడ్ల కొనుగోలు కేంద్రంలో రెండు రోజులపాటు జరిగినటువంటి కొనుగోళ్లలో అక్కడున్న కొనుగోలు కేంద్ర నిర్వాహకులు 40 కిలోల బస్తాకు మూడు కిలోల తరుగు చొప్పున 43 కిలోలు తూకం వేసి రైతుకు 40 కిలోల చొప్పున లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular