- Advertisement -
By CHIRANJI THIRUPATHI
కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృషి ఫలించింది. జమ్మికుంట,ఉప్పల్ రైల్వే స్టేషన్లను అభివ్రుద్ధి చేసేందుకు దక్షణి మధ్య రైల్వే శాఖ సిద్ధమైంది.ఈ మేరకు అతి త్వరలోనే అధికారుల బ్రుందాన్ని ఆయా స్టేషన్లకు పంపి అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపనుంది. దీంతోపాటు జమ్మికుంటలో వ్యాగన్ ఓర్ లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటుతోపాటు రోడ్ అండర్ పాస్నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు.త్వరలోనే ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
- Advertisement -




