ఇస్కాన్ అహోబిలం ఆధ్వర్యంలో ఘనంగా పారవేట ఉత్సవాలు
రుద్రవరం
మండలంలోని హరినగరం సమీపంలో ఉన్న ఇస్కాన్ అహోబిలం ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి పారవేట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ప్రాజెక్ట్ ఇంచార్జ్ చంద్ర కేశవ దాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి పారవేట ఉత్సవాల చివరి మజిలీలో భాగంగా ఇస్కాన్ అహోబిలం హరినగరం దగ్గర నేడు సాయంత్రం 5 గంటలకు ఇస్కాన్ భక్త బృందం చే కీర్తనలు, 6 గంటలకు తులసి హారతి, 6, 15 నిమిషాలకు గౌర హారతి, ఆ6. 45 నిమిషాలకు నరసింహ కీర్తన, 7 గంటలకు అతిథులకు సత్కారము, భోజన ప్రసాదం, 7:30కు ముఖ్య అతిథుల చేత ప్రవచనాలు, 8:30 నిమిషాలకు రష్యా నుండి వచ్చిన ఇస్కాన్ భక్త బృందం చే కీర్తనలు భజనలు మరియు నృత్యం, 9 గంటలకు విజయ మ్యూజికల్ డాన్స్ అకాడమీ నెల్లూరు వారిచే సంస్కృతిక కార్యక్రమాలు, 12 30 నిమిషాలకు లక్ష్మీ నరసింహ స్వామికి స్వాగతం, 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఉత్సవ మూర్తులకు మంగళహారతి 5 గంటలకు ఉత్సవ పల్లకి ప్రయాణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు
ఇస్కాన్ అహోబిలం ఆధ్వర్యంలో ఘనంగా పారవేట ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -