- Advertisement -
శశి కళాశాలలో ఘనంగా ఇంజనీరింగ్ దినోత్సవం
A grand Engineering Day at Shashi Collegeతాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 14,
స్థానిక శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. యం. నాగేంద్రనాథ్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డినోప్ట్స్ డిజైన్ ఇంజనీరింగ్ కంపెనీ విశాఖపట్నం సీఈఓ ప్రకాష్ ఇంటూరి వారిచే మల్టి ఫిజిక్స్ సిములేషన్ ఇన్ అన్సిస్ అనే అంశం పై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. అనంతరం వివిధ విభాగాలలో విద్యార్థులకు సహ పాఠ్య మరియు అదనపు పాఠ్య కార్యకలాపాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -




