సర్పంచులకు బీజేపీ మద్దతు: పురందేశ్వరీ
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్ లు పార్టీలకతీతంగా మా మద్దతు కోరారు అన్నారు వారికి భాజపా పూర్తి మద్దతుగా నిలుస్తోంది. మడ అడవులు నరికి వేత, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగి పోతోంది అని అన్నారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలుకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారు. పిఠాపురం వంతెనపై శీతకన్ను వేయడంవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనసేనతో నిన్న, నేడు పొత్తు ఉందన్నారు మిగతా పార్టీల సంగతి అధిష్ఠానం చూసుకుంటుంది అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం అన్నారు. ఆగస్టు 10న జిల్లాల్లో సర్పంచ్ లకు మద్దతుగా ధర్నాలు చేస్తామని, 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామని పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల అంశం కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు.



