పెద్దిలో  ఇప్పుడు ‘కుస్తీ’ కూడా

- Advertisement -

పెద్దిలో  ఇప్పుడు ‘కుస్తీ’ కూడా

Peddi now has ‘Kusti’ too
పెద్ది`పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలూ ఫ్యాన్స్ కి నచ్చేశాయి. పాటలైతే… యూ ట్యూబ్ లో కొత్త రికార్డుల్ని సృష్టించాయి.ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. 45 సెకన్ల ఈ గ్లింప్స్ లో చరణ్ వన్ మాన్ షో కనిపించింది. చరన్ తప్ప.. ఎవరిపైనా కెమెరా ఫోకస్ చేయలేదు. ఒక వేళ మరొకరు ఉన్నా, కళ్లు చరణ్ పై మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్లో ఉంది. కండలు తిరిగిన దేహం, చేతిలో గద..మైదానంలో కుస్తీ పట్లు.. ఈ యాక్షన్ హంగామా అంతా ఫ్యాన్ఫ్ కి నచ్చేలా ఉంది.ఇప్పటి వరకూ ‘పెద్ది’ అంటే క్రికెట్టే అనుకొన్నారు. కానీ ఇప్పుడు ‘కుస్తీ’ కూడా వచ్చింది. మైదానంలో చరణ్ కుస్తీ కోసం రంగంలోకి దిగడం ‘ఆటేనా పొగరు’ అని చెప్పడం.. ఇవన్నీ చరణ్ క్యారెక్టర్ని మరింత ఎలివేట్ చేశాయి. చరణ్ని ఇప్పటి వరకూ ఇలా చూడలేదు అభిమానులు. బుచ్చిబాబు చరణ్ని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ‘పెద్ది’లో ఇప్పటి వరకూ క్రికెట్, కుస్తీ చూపించారు. అయితే వీటికి మించిన ఆటలెన్నో పెద్దిలో ఉండబోతున్నాయి. అవన్నీ ఒకొక్కటిగా రివీల్ చేయబోతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular