Sunday, September 8, 2024

ఓ పాకిస్తాన్ హస్కీ వాయిస్‌… చిక్కిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌

- Advertisement -

హనీ ట్రాప్‌కు చిక్కిన విశాఖ స్టీల్ ప్లాంట్  సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

విశాఖ, ఆగస్టు 07: వాయిస్ టుడే:  హాలో అంటూ హస్కీ వాయిస్‌తో పలకరింపు. సుతిమెత్తగా సరస సల్లాపాల బాత్‌ చీత్‌.. బకరా ట్రాప్‌లో పడ్డాడని పసిగట్టగానే నిన్నే పెళ్లాడుతా అనే బంపర్‌ ఆఫర్‌. ఇది ఆన్‌లైన్‌ హానీ ట్రాపింగ్‌ వ్యవహారం. మరి ఆఫ్‌లైన్‌ వలపుల వల మరో రకం. రోడ్డు సైడ్‌ ములాఖాత్‌… నైస్‌గా మాట్లాడుతూ ఫోన్‌ నెంబర్‌ ఎక్స్‌ఛేంజ్‌.. అందాల బామ ఫోన్‌ నెంబర్‌ అడిగితే నరుడు ఆనందం అంతా ఇంతా.. బ్యూటీ క్వీన్‌ తన కోసం వచ్చినట్టుగా ఫిదా.. ఫోన్‌ చేస్తావు కదా.. మర్చిపోవద్దు అంటూ వేడుకోలు. ఇక ఆ తరువాత ఫోన్‌లో చిట్‌చాట్‌.. పార్క్‌లో షికార్లు.. చుప్‌ చుప్‌ కే ములాఖాత్‌లు.. ఇన్ని రకాలు హరీ ట్రాప్ సాగుతుంది. ఇందులో మొదటి రకం ట్రాప్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను పడేసింది ఓ పాకిస్తాన్ హస్కీ వాయిస్‌. అసలు సంగతిలోకి వెళ్తే.. పాకిస్తానీ నిఘా వర్గాల హనీ ట్రాప్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ చిక్కుకున్నారు.

a-husky-voice-of-pakistan-a-trapped-cisf-constable
a-husky-voice-of-pakistan-a-trapped-cisf-constable

సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని భారత నిఘావర్గాలు పసిగట్టాయి. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (పీఐవో) మొబైల్ నంబర్ 7764892291తో సంప్రదింపులు జరుపుతున్నారనే నిఘా వర్గాల సమాచారంతో స్టీల్ ప్లాంట్ సీఐఎస్ఎఫ్ అధికారులు అలెర్ట్ అయ్యారు. వెంటనే కపిల్‌ను అరెస్ట్ చేయకుండా మూడు రోజుల పాటు నిఘా పెట్టారు. ఆ తర్వాత అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు విచారణలో కపిల్ కొన్ని విషయాలను వెల్లడించినా కొన్ని వివరాలను గోప్యంగా ఉంచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు ఫేస్ బుక్ లో హైదరాబాదీ అమ్మాయి తమిషాగా పరిచయం అయినట్టు చెబుతున్న కపిల్ ఇటీవలనే ఆమె పరిచయం అయిందని.. ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని చెబుతున్నట్టు సమాచారం.

అయితే ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కపిల్ మొబైల్‌కు ఒక మొబైల్ యాప్ లింక్ ను పంపిన పాకిస్తానీ నిఘా అధికారిని తమిషా దాన్ని ఇన్స్టాల్ చేయమని చెప్పినట్టు పోలీస్ విచారణలో కపిల్ వెల్లడించారు. అయితే ఓపెన్ చేసేందుకు తాను భయపడ్డట్టు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ చెబుతుండడాన్ని ఉన్నతాధికారులు విశ్వసించడం లేదు. ఎందుకంటే తన వద్ద రెండు మొబైల్స్‌నే ఉన్నట్టు కపిల్ మొదట చెప్పారు. అనంతరం పోలీస్ తనిఖీల్లో మరో ఆండ్రాయిడ్ మొబైల్ బయట పడింది. అందులో సమాచారం అంతా డిలీట్ చేసినట్టు గుర్తించిన పోలీసులకు మరింత అనుమానం వచ్చింది. దీంతో అన్ని మొబైల్స్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి డేటా మొత్తం రీ కలెక్ట్ చేస్తున్నారు అధికారులు. అలాగే ఖచ్చితంగా నగదు లావాదేవీలు జరిగి ఉంటాయని భావిస్తున్న పోలీసులు వాటి పైనా ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం పోలీసుల అదుపులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ గత ఏడాది ఆగస్ట్ 22 నుండి స్టీల్ ప్లాంట్ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అంతకుముందు 2017 నుంచి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భానూర్, హైదరాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పీఎస్‌యూలో విధులు నిర్వర్తించారు. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇలా ఎప్పటినుంచి టచ్‌లో ఉన్నారోనన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని సేకరించే ప్రయత్నంగా గుర్తించారు.విశాఖలో ఇండియన్ నేవీకి చెందిన ఈస్ట్రన్ నేవెల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. నేవీకి సంబంధించిన పలు రహస్య పరిశోధనలు, ఆయుధ కర్మాగారం విశాఖలో పెద్ద ఎత్తున ఉంటాయి. అలాగే తూర్పు తీర ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకమైన రక్షణ స్థావరం గా ఈస్టర్న్ నేవీ ఉంటుంది. రాంబిల్లి లో నిర్మితమవుతున్న నావెల్ ఆల్టర్నేటివ్ బేస్ దేశ రక్షణ రంగంలో అత్యాధునికమైన రహస్య స్థావరంగా ఉంది. సముద్ర భూగర్భంలో నిర్మించిన ఈ నేవెల్ బేస్ పై శత్రుదేశాల కన్ను ఉంది. ఇంతటి కీలకమైన విశాఖలో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఒక్క కానిస్టేబుల్ ని పాకిస్తానీ నిఘా వర్గాలు తమ అదుపులోకి తీసుకోవడం, అదే క్రమంలో ఇక్కడి నుంచి గతంలో ఏమైనా వీడియో లాంటివి పంపారా, ఇంకా ఏదైనా నేవీ రహస్య ప్రాంతాల్లో ఈ కానిస్టేబుల్ ఏమైనా సంచరించారా అన్న వ్యవహారాన్ని కూడా గూగుల్ టేక్ అవుట్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వెలికి తీస్తున్నారు. కుమార్ విశాఖ వచ్చినప్పటి నుంచీ ఆయన కదలికల కు సంబందించిన లొకేషన్లను తాజాగా వెలికి తీస్తున్నారు.స్టీల్ ప్లాంట్ సీ ఐ ఎస్ ఎఫ్ యూనిట్ ఇంచార్జ్ గోవింద స్వామి శరవణన్ ఫిర్యాదు తో విశాఖపట్నంస్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అధికారిక రహస్యాల చట్టం 1923లోని 4,9 రెడ్ విత్ 3 సెక్షన్ల తో cr No: 61/2023 గా కేసు నమోదైంది. ఆ మేరకు కేసు మొబైల్స్ సీజ్ చేసి ఫోరెన్సిక్ కు పంపీ పాత డేటా ను కలెక్ట్ చేసే పనిలో పడ్డారు విచారాణాధికారులు. డేటా అంతా రికవరీ చేశాక మొత్తం వివరాలు వెల్లడించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్