- Advertisement -
అనారోగ్యశ్రీగా మార్చిన కూటమి సర్కార్
A Kutami government that has made it unhealthy
వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ
పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర మానస పుత్రిక ఈ పథకం. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి విమర్శించారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉందని అన్నారు.
వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
- Advertisement -