- Advertisement -
చెట్టుకు ఢీకొట్టిన లారీ..క్లీనర్ మృతి..డ్రైవర్ కు తీవ్ర గాయాలు
A lorry hit a tree, the cleaner died, the driver was seriously injured
కరీంనగర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ చెట్టు మధ్యలో డ్రైవర్ క్లీనర్ ఇరుక్కొని దాదాపు మూడు గంటలు నరకయాతన అనుభవించారు. మండలం మాందాడిపల్లి
గ్రామ సమీపం లో బుధవారం తెల్లవారుఝామున ప్రమాదం జరిగింది. మూడు గంటల పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు కష్టపడి ఇద్దరినీ బయటికి తీసారు. ఘటనలో కి క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ పరిస్థితి
విషమం గా ఉండడం తో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కృష్ణ జిల్లా నుండి గుజరాత్ కు లారీ వెళుతుంది. డ్రైవర్ విజయవాడ కు చెందిన షేక్ బాబా గా గుర్తించగా క్లీనర్ వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -