కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి
A loving person who loved society beyond caste differences
సిద్దిపేట
సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమిద్ తో కలిసి
జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతు
భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయిని రచయిత్రి కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఈమే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించిందని ఈ సందర్బంగా సావిత్రి బాయి పూలే ను స్మరించుకోవడం అందరి భాద్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.