Monday, October 14, 2024

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా

- Advertisement -

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా

A thousand cows will be given.. a lakh cows will be collected

సొంత డెయిరీ ఏర్పాటు చేయండి
టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన
“తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన
రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు
* 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన..
బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన వంతుగా భూరి సాయం ప్రకటించడంతో పాటూ ఓ పెద్ద బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” మంగళవారం ఉదయం స్వామి దర్శనంతో ముగిసింది.. ఈ సందర్భంగా తిరుమలలో విలేఖరుల నిర్వహించి కీలక ప్రకటన చేశారు.. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన, స్వామివారికి పూజల్లో వినియోగించే నెయ్యి సొంతంగా తయారీ కోసం సూచనలు చేశారు..!
వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమీకరిస్తా..!
కోట్లాది మంది భక్తులు.. వేల కోట్ల ఆస్తులు న్న తిరుమల పుణ్యక్షేత్రంలో సొంతంగా డెయిరీ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి.. లడ్డు ప్రసాదం సహా, పూజా నెయ్యి కూడా అపవిత్రం అవుతుంది. అందుకే సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని సూచించారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే.. తన వంతుగా వేయి ఆవులు టీటీడీకి ఇస్తానన్నారు.. అలాగే మరో లక్ష ఆవులు సమీకరించడానికి బాధ్యత తీసుకుని పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..* లక్ష ఆవులతో తిరులలో సొంతగా డెయిరీ ఏర్పాటు చేస్తే రోజుకి రోజుకి కనీసం 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందని.., తద్వారా 50 వేల కిలోల వెన్న ఉత్పత్తి ఉంటుందని, దీని ద్వారా రోజుకి సుమారుగా 30 వేల కిలోల నెయ్యి సొంత తయారీ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు..* ఈ మేరకు లక్ష గోవులతో గోశాల ఏర్పాటు చేస్తే.. 10 వేల మంది గోపాలులకి  ఉపాధి కల్పించవచ్చని.. వీలైతే వారిని యాదవ సామాజికవర్గం నుండి తీసుకుంటే.. గో సేవకులుగా వారు సమర్ధవంతంగా, ఆసక్తిగా పని చేయగలరని సూచించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్