13.2 C
New York
Thursday, February 29, 2024

కామారెడ్డి లో త్రిముఖ పోటీ తప్పదా…?

- Advertisement -
కామారెడ్డి లో త్రిముఖ పోటీ తప్పదా…?

– గతంలో ఓటమి ఎరగని గంప గోవర్ధన్…
– బిఆర్ఎస్ లొ కేడర్ ఆధిపత్యం ” పై చెయ్యి ఎవరిది” …?
– నా ప్రాణం ఉన్నంతవరకు కామారెడ్డి నియోజకవర్గంలో అక్రమాలు జరగనివ్వనన్న రమణారెడ్డి…
– తెలంగాణ ఉద్యమంలో మేము సహకరించకపోతే కెసిఆర్ ఎక్కడుండేవారు. కేటీఆర్ తెలంగాణకు వచ్చేవారా మహమ్మద్ ఆలీ షబ్బీర్….
– గ్రాఫ్ తగ్గేది ఎవరిది, పెరిగేది ఎవరిది….?
– రాష్ట్రంలోనే కామారెడ్డి పేరు మారుమోగుతున్న వైనం…
– కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి రాకతో కామారెడ్డిలో గెలుపోటములపై ఉత్కంఠ…
కామారెడ్డి బ్యూరో నవంబర్ 4 (వాయిస్ టుడే)
కామారెడ్డి జిల్లాలో వార్ వన్ సైడే అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాకతో కామారెడ్డి తెలంగాణ స్థాయిలోనే చర్చగా మారింది. నేడు నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీకి గ్రామస్థాయిలో ఏకగ్రీవ తీర్మానాలు చేసినప్పటికీ, రేవంత్ రెడ్డి రాకతో పాటు, టిఆర్ఎస్ లో జరుగుతున్న ఘటనలు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ కామారెడ్డి పోటీ చేయడం ప్రాముఖ్యత నెలకొంది. శత్రువు ఇతర పార్టీలో లేనప్పటికీ, సొంత పార్టీలోనే శత్రువులు మొదలై, గతంలో ఓటమి ఎరగని గంప గోవర్ధన్ కు సీఎం ను కేసీఆర్ ను కామారెడ్డి కి వచ్చేలా చేసిన వైనం నెలకొంది. కెసిఆర్ గెలుపు కామారెడ్డిలో నల్లేరుపై నడక అని భావించిన నాయకులు కార్యకర్తలు క్షేత్ర సాయిలొ భావించినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న, ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దోమకొండ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ప్రసంగం తో క్షేత్రస్థాయిలో మేము న్యాయంగా ఉన్నాము. నాయకులు భయంగానే ఉన్నారు. కానీ తెలంగీలు వేసుకొని తెలిసి తెలియని రాజకీయాలు చేస్తూ ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేస్తున్నారని కె టి ఆర్ కు సామాన్యుడు చెప్పిన మాటను కేటీఆర్ దోమకొండ మండల కేంద్రంలోని కాలేజ్ గ్రౌండ్ లో తెల్లంగిలతోనే బాధ ఉందని గుర్తుచేసి వారిని మేము సరి చేస్తామని ఉన్నారు. దయస్ పై ఉన్న తెల్లంగీలు రైతులు బిక్క మొహంతో చూడడంతో మిమ్మల్ని కాదు మీరు ఫీల్ కావాల్సిన బాధ్యత లేదని వారిని సముదాయించి అందుకే ఈరోజు నేను తెల్లయి వేసుకోకుండా సబికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగీలు అనగానే సవికులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైనం కేటీఆర్ మా పూర్వీకుల గ్రామం దోమకొండ ఆనాటి పోసానిపేట నేడి కోనాపూర్ అని గుర్తుచేసి వారిని శాంతింప చేశారు. మొన్న చైర్మన్ ఉద్యమ నాయకుడు తిరుమల్ రెడ్డి పై జరిగిన దాడి, నేడు మాచారెడ్డి మండల మిల్కూరి రామిరెడ్డి పై జరిగిన దాడి తో బిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తీవ్రమైంది. టిఆర్ఎస్ స్వయంకృపవాదం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే బిజెపి అభ్యర్థి రమణారెడ్డి కుల సంఘాలు, బీడీ కార్మికులు, దేవాలయాలు సందర్శిస్తూ నా ప్రాణం ఉన్నంతవరకు కామారెడ్డిలో అన్యాయం జరగకుండా చూస్తానని పాత్రికేయుల సమావేశంలో పలుమార్లు వెల్లడించారు. షబ్బీర్ అలీ బలమన్నాయుడుగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో నేను చురుకైన పాత్ర పోషించ లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు అంటూ కెసిఆర్ ను విమర్శిస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ ఏర్పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. బి ఆర్ బి ఆర్ ఎస్ పార్టీలో ఇలాంటి ఘటనలు ప్రతిపక్షాలకు అనుకూలంగా మారాయని బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుసగుసలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిఆర్ఎస్ పార్టీలో అప్పటి తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు టిఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. దీంతో వర్గ పోరు తీవ్రమైంది. కెసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడక అని భావించిన కామ రెడ్డి ప్రజానీకం ఇలాంటి తెల్లంగీల నాయకులతో వారు అయోమయంలో ఉన్నారు. కామారెడ్డిలో త్రిముఖ పోటీ నిలవకుందని భావిస్తున్నారు. గెలుపు ముంగిట ఉన్న నాయకుని ద్వితీయ శ్రేణి నాయకులు క్షేత్ర గ్రామస్థాయిలోని నాయకులు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవస్థ నాయకులు పార్టీని అభాసుపాలు చేస్తున్నారు.కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల జడ్పిటిసి మీనుకురి రామ్ రెడ్డిపై ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు చేయి చేసుకోవడం తొ ఒక్కసారిగా గెలుపోటములు తారుమారు అయ్యే పరిస్థితి నెలకొంది. స్థానిక జెడ్పిటిసికి తీవ్ర గాయాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎంపీపీ మాచారెడ్డి మండలంలో పార్టీలో పెత్తనం చలాయిస్తూ పార్టీ కార్యకర్తలపై గతంలో కూడా చేయి చేసుకోవడం జరిగిందనీ, స్థానిక ఎంపీపీ పార్టీలోని చాలామంది సీనియర్ కార్యకర్తలు మనస్థాపానికి గురి చేయడం, జ పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నదనీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గతంలో మాచారెడ్డి మండల కేంద్రానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలపై స్థానిక ఎంపీపీ అతని అనుచరులు తో కలిసి సదరు వ్యక్తిపై దాడి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై ఉన్న అభిమానం పార్టీపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు తరచూ క్రమశిక్షణ పాటిస్తూ ఉండడం, అధికార పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు పార్టీని దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నోసార్లు ఇతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో ఆయన ఇస్తున్నారని క్షేత్రస్థాయి నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీపీ లోయపల్లి నరసింహారావును అతని అనుచరులను చూసి కూడా ప్రజలు భయాందోళనకు గురివున్నారు‌. కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం అతని అదుపులో పెట్టకపోతే పార్టీ క్యాడర్ పై స్థానిక నియోజకవర్గంపై తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బిజెపి అభ్యర్థి తాటిపల్లి రమణారెడ్డి పలుమార్లు పాత్రికేయుల సమావేశంలో నేను ఓడిన గెలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో అక్రమాలు జరగనివ్వనని ప్రతి సమావేశంలో ఇదే మాటను చెబుతున్నారు. ఉప ఎన్నిక రాకూడదని ఆయన మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ సహకరించకుంటే కెసిఆర్ ఎక్కడ ఉండేవారని. విదేశాలు వదిలి తెలంగాణకు వచ్చేవారా అని పలుమార్లు విమర్శించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!