కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ఘన స్వాగతం
తిరుపతి,
A warm welcome to Union Minister Nitin Gadkari
బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హై వేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు శాఖ మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్&బి కాంతి లాల్ దండే, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎంఎల్ఎ పులివార్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ప్రోటోకాల్ ఎస్డిసి రాంమోహన్, ఆర్డీఓ శ్రీకాళహస్తి, ఆర్.ఓ ఎన్హెచ్ఏఐ ఆర్.కె సింగ్, రాకేష్ కుమార్ ఏపీ ఆర్.ఓ, మోర్త్ విజయవాడ, వి. రామచంద్ర రావు సిఈ, విజయవాడ, పీడి NHAI తిరుపతి వెంకటేష్, తిరుపతి ఆర్ అండ్ బి ఎస్.ఈ మధుసూధన్ రావు, మాజీ టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర మంత్రి గారు ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్ నందు ఏపీ జాతీయ రహదారులు, హై వే ప్రాజెక్టులపై అధికారులతో మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షించి, మదనపల్లె కు హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్ళారు. సదరు కేంద్ర మంత్రి నేటి రాత్రి తిరుమల చేరుకుని గురువారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.