- Advertisement -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
A woman died in a road accident
మేడ్చల్
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శనివారం ఉదయం ఏడు గంటలకు మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ముందు మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో మేడ్చల్ నుండి ఓ ఆర్ ఆర్ వైపు వెళ్తున్న లారీ మహిళను ఢీ కొట్టింది. దీంతో మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన మహిళ .రాగ జ్యోతి(32) పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు
- Advertisement -