- Advertisement -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
A woman died in a road accident
కరీంనగర్
బోయినిపల్లి మండలం వెంకట్రావ్ పల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న మహిళ మృతి చెందింది. మరొక మహిళ తో పాటు ఇద్దరు అయ్యప్ప స్వాములకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిని వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు క్షతగాత్రులు కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. గట్టు బాబు, అశోక్, మంగ, అహల్య నలుగురు వేములవాడ నుండి కరీంనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నుజ్జునుజైన కారు నుంచి మృతురాలను స్థానికులు పోలీసులు అతికష్టం మీద బయటకు తీసారు.
- Advertisement -