మంగళగిరిలో ఘనంగా ఏబి బర్ధన్ శత జయంతి ఉత్సవం

- Advertisement -

మంగళగిరిలో ఘనంగా ఏబి బర్ధన్ శత జయంతి ఉత్సవం

AB Bardhan Centenary Celebration in Mangalagiri

మంగళగిరి,
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గం సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వర్రావు, ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గండికోట దుర్గారావు సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, ఉడత శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, పంత గాని మరియదాసు, గుంటక సాంబిరెడ్డి, ఉయ్యాల సత్యనారాయణ, ఎస్కే కరీముల్లా, బాపనపల్లి శంకర్రావు, శ్రీనివాసరావు, రమణమ్మ, కాకర్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular