రాష్ట్ర ప్రభుత్వ  పింఛను దార్ల జీవన ప్రమాణ పత్రాల స్వీకరణ ప్రారంభం…  

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ  పింఛను దార్ల జీవన ప్రమాణ పత్రాల స్వీకరణ ప్రారంభం…  

నంద్యాల

మన నంద్యాల జిల్లా లో పించను  పింఛనుదార్ల జీవన ప్రమాణ పత్రాల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభమైందని, జిల్లా ఖజానా మరియు గణాంక శాఖ అధికారిని ఎం. లక్ష్మీదేవి తెలియజేశారు. ప్రతి సంవత్సరం  పించను కొనసాగింపు కోసం జీవన ప్రమాణ పత్రాలను (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించవలసి ఉంటుందని  ఫించను దారులకు మెరుగైన వసతులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వము డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు స్వీకరణకు అవకాశం కల్పించిందని తెలియజేశారు. కనుక జిల్లాలోని ఫించను దారులు జీవన ప్రమాణ విధానం ద్వారా తమ తమ లైఫ్ సర్టిఫికెట్లను జనవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి 29వ తేదీ లోగా సమర్పించాలని కోరడమైనది. దీనికై సెంటర్ ఉప ఖజానా కార్యాలయంలో గాని, తమ తమ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత కాలంలో సమర్పించని వారి పింఛను మార్చి  నుండి నిలిపివేయబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. దీని కొరకు ప్రత్యేక కౌంటర్లను   ప్రతి ఉప ఖజానా మరియు జిల్లా ఖజానా కార్యాలయాలలో ప్రారంభించారని తెలియజేశారు. కనుక పింఛనుదారులు జీవన ప్రమాణ పత్రాలను, (లైఫ్  సర్టిఫికెట్లు) నిర్దేశిత గడువులోగా సమర్పించి వారి పింఛను క్రమబద్ధీకరించుకోగలరని, ఆమె తెలియజేస్తూ ఏదైనా ఇబ్బందులు ఎదురైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు రాగలరని కోరడమైనది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular