ఏదైనా సంచలనమైన ఘటన చేసి తాను అందరి దృష్టిలో పడాలని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసినట్లు నిందితుడు ఘటం రాజు ఒప్పుకున్నట్లు సీపీ శ్వేత తెలిపారు. రాజును అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. ఎంపీ గన్మెన్ ప్రభాకర్ నుండి కత్తి, పాస్టర్ అంజయ్య ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో డిపాజిట్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన నిందితుడు గట్టం రాజును గజ్వేల్ కోర్టులో దౌల్తాబాద్ పోలీసులు హాజరు పరిచారు. ఈమేరకు న్యాయమూర్తి ప్రియాంక నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. 15వ రోజు తిరిగి కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. దీంతో పోలీసులు రాజును చర్లపల్లి జైలుకు తరలించారు. రాజును కోర్టులో హాజరు పరిచే సమయంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.



