ముఖ్య అతిథిగా ప్రొ.కోదండరాం రాక
జగిత్యాల: పదేండ్ల తెలంగాణ పాలన, అమరుల ఆశయాలపై జగిత్యాల జిల్లా కేంద్రములో ఈనెల 18 శనివారం తెలంగాణ ఉద్యమకారుల సదస్సు నిర్వహించనున్నట్లు ఉద్యమాల జెఎసి నాయకులు, తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సదస్సు కు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల రథసారథి, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ యం.కోదండరాం తో పాటు పలువురు వక్తలు హాజరు కానున్నట్లు ఆయన సూచించారు. జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు, విద్యావంతులు, విద్యార్థులు, యువత, తెలంగాణ ఉద్యమంలో కృషి చేసిన జెఎసి నాయకులు, జెఎసి సభ్యులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, కార్మికులు, కర్షకులు తదితరులు ఈ సదస్సులో పాల్గొని విజయ వంతం చేయాలని చుక్క గంగారెడ్డి పిలుపు నిచ్చారు.