ఎంపీ వద్దిరాజు మంత్రి కేటీఆర్ తో కలిసి తెలంగాణ భవన్ లో
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు,అజయ్ కుమార్ లతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, పువ్వాడ అజయ్ కుమార్,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి,తాతా మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు మాదిరెడ్డి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.