Friday, April 17, 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ..

- Advertisement -

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ..
రూ.10 లక్షల బిల్లు పాస్ చేసేందుకు రూ.30 వేల డిమాండ్:

ADE Caught by ACB While Accepting a Bribe

విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు ఏసీబీ అధికారులకు

అడ్డంగా దొరికిపోయాడు. కంబాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వీచిన గాలివానకు దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఓ వ్యక్తి పునరుద్ధరించాడు. ఇందుకు సంబంధించిన రూ.10

లక్షల బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు సదరు ఏడీఈ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఏప్రిల్ 16న తన కార్యాలయంలో

లంచం డబ్బులు తీసుకుంటుండగా సైదులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి

జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్