నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -

నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

 సాంకేతిక ఆధారాలతో కేసు చేదించిన మావల పోలీసులు.

 
36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం
 

 ప్రజలు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

 గతంలో A1 పై 8 , A2 పై మూడు దొంగతనం కేసులు.
Inter-state gang of four thieves arrested
 
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్
జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరుస దొంగతనాల కేసులను మావల పోలీసులు సమర్థవంతంగా ఛేదించి, నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

వివరాలలో

ఈ ఏడాది జనవరి 18న ఆదర్శ్‌నగర్‌కు చెందిన నైతం గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మావల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ కెమెరాలు, క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మహారాష్ట్రకు చెందిన అలవాటుగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన నిందితులు:

1. షిండే సునీల్ @ రాకీ (A1) (25), గిట్టికడమ్, బోర్‌గావ్, వర్ధా జిల్లా, మహారాష్ట్ర.
2. కుమ్రే సుజల్ యురాజ్ (A2)   (19), బోర్‌గావ్ గ్రామం, సావంగి పీఎస్, వర్ధా జిల్లా, మహారాష్ట్ర.
3. మార్జివే శేఖర్ (A3) (43), రామ్‌నగర్, ఎస్‌టిడి డిపో రోడ్, వర్ధా జిల్లా, మహారాష్ట్ర.
4. గాయకవాడ్ లక్ష్మణ్ (A4) (28), వెరోల్లా గ్రామం, భండారా జిల్లా, మహారాష్ట్ర.

విచారణలో నిందితులు మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆదర్శనగర్ కాలనీ, టైలర్స్ కాలనీలలో, క్రైమ్ నెం.34/2026, 35/2026, 41/2026 కేసులకు పాల్పడినట్లు   తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన ఇతర ఇంటి చోరీ కేసుల్లో వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గతంలో ప్రధాన నిందితుడు A1 పై మహారాష్ట్ర వార్దా మరియు యువతమాత జిల్లాలలో 8 కేసులు నమోదు అయినట్లు అదే విధంగా మరో నిందితుడు A2 పై మూడు కేసులు నమోదు అయినట్లు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంట్లో అధిక మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు భద్రత లేకుండా ఉంచవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100 కు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది షబ్బీర్, సట్ల శ్రీను, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular