Sunday, January 25, 2026

సంతాన ప్రాప్తిరస్తు” సినిమా చూశాక మంచి తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది – డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్

- Advertisement -

సంతాన ప్రాప్తిరస్తు” సినిమా చూశాక మంచి తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది – డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్

After watching the movie “Santhana Praptirastu”, I felt as satisfied as eating good Telugu meals – Director, actor Tarun Bhaskar

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్. ఫ్యునెరల్ సర్వీసెస్ నడిపే జాక్ రెడ్డికి కుల పట్టింపు ఎక్కువే. ఆయన ఈ పాత్రలో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. రీసెంట్ గా “సంతాన ప్రాప్తిరస్తు” మూవీ ప్రివ్యూ చూసిన తరుణ్ భాస్కర్..సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. సొసైటీలో ప్రస్తుతం ఉన్న ఇన్ ఫెర్టిలిటీ ఎలిమెంట్ తో ఫన్, ఎమోషన్ కలిపి ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టమని, “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారని తరుణ్ భాస్కర్ అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. కానీ మూవీ చూశాక నా అనుమానాలు అన్నీ ఎగిరిపోయాయి. ఇదొక డీసెంట్ మూవీ. సరదాగా అలా మూవీ అంతా వెళ్లిపోయింది. మనం బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానా మూవీస్ చూస్తుంటాం. అలాంటి ఫీల్ కలిగింది. సొసైటీలో ఇప్పుడున్న సంతాన లేమి అనే సమస్యను ఎంటర్ టైనింగ్ గా, ఎమోషన్ గా చెప్పడం క్లిష్టమైన పని. “సంతాన ప్రాప్తిరస్తు” టీమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇంట్లో చేసిన మంచి తెలుగు మీల్స్ తిన్నప్పుడు ఎలాంటి తృప్తి ఉంటుందో, అలాంటి ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. సినిమా ఎక్కడా హెవీగా అనిపించలేదు, ఓవర్ డ్రామా లేదు, సరదాగా చూస్తూ వెళ్లాను. నేను చేసిన జాక్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వాళ్లు బయట కనిపిస్తుంటారు. పైకి టఫ్ గా కనిపిస్తున్నారు గానీ వాళ్ల లోపల సాఫ్ట్ నెస్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కు స్పిన్నాఫ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. చైతన్య క్యారెక్టర్ లో విక్రాంత్ పర్పెక్ట్ గా కుదిరాడు. కాస్టింగ్ అందరి నుంచి మంచి పర్ ఫార్మెన్స్ చూస్తారు. అలాగే టీమ్ అంతా హానెస్ట్ గా చేసిన వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ నెల 14న “సంతాన ప్రాప్తిరస్తు” తప్పకుండా చూడండి. అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్